- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. EAPCET ఫలితాలు విడుదల
తెలంగాణలో ఇటీవల జరిగిన EAPCET ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఇటీవల జరిగిన EAPCET ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ హైదరాబాద్ (JNTUH) ఆధ్వర్యంలో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) తరపున నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా తెలంగాణలోని వివిధ యూనివర్శిటీలు, ప్రైవేటు కళాశాలల్లో BE, B Tech, B Pharm, Pharm D, BSc (Hons) Agriculture, BFSc, BVSc వంటి అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం పొందనున్నారు. విద్యార్థుల రిజిస్టర్ మొబైల్ నెంబర్లకు నేరుగా ఫలితాలను పంపనున్నారు. మరికాసేపట్లో విద్యర్థులకు నేరుగా ఈ ఫలితాలు వెళ్లనున్నాయి. లేదా అధికారిక వెబ్ సైట్ https://eapcet.tgche.ac.in/TGEAPCET/EAPCET_GetResult. పై క్లిక్ చేసి ఫలితాలను చూసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
కాగా ఈ ఫలితాల్లో ఇంజనీరింగ్ లో పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడకు చెంది పల్లా భరత్ చంద్ర మొదటి ర్యాంక్ సాధించాడు. అలాగే రంగారెడ్డి జిల్లా మాదాపూర్ కు చెందిన ఉదగండ్ల రామ చరణ్ రెడ్డి ఇంజనీరింగ్‌లో రెండో ర్యాంక్ సాధించాడు. అలాగే విజయనగరానికి చెందిన హేమసాయి సూర్య కార్తీక్ కు 3వ ర్యాంక్ సాధించగా.. నాచారం కు చెందిన మెండె లక్ష్మి భార్గవ్ 4వ ర్యాంక్, మాదాపూర్ కు చెందిన వెంకట గణేష్ రాయల్ 5వ ర్యాంక్ సాధించాడు. వీరితో పాటుగా మాదాపూర్ కు చెందిన సుంకర సాయి రిశాంత్ రెడ్డి 6వ ర్యాంక్ తో మెరిసాడు.
- Tags
- EAPCET results






