DOST Notification : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు దోస్త్ నోటిఫికేషన్

by Muthe.Rajitha |

విద్యార్థులకు బిగ్ అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం.

DOST Notification : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు దోస్త్ నోటిఫికేషన్
X

దిశ, వెబ్ డెస్క్ : విద్యార్థులకు బిగ్ అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం. డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ (Degree Online Servises Telangana) నోటిఫికేషన్ విడుదల తేదీని ప్రకటించింది. రేపు(మే 6న) మధ్యాహ్నం 12.30 గంటలకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకృష్ణారెడ్డి దోస్త్(DOST) నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. కాగా తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నా.. ఇంకా దోస్త్ నోటిఫికేషన్ విడుదల కాకపోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు.

రేపు దోస్త్ నోటిఫికేషన్ రానున్న విషయం తెలుసుకొని.. కళాశాలల్లో అప్లై చేసుకోడానికి స్టూడెంట్స్ సిద్ధం అవుతున్నారు. కాగా కొన్ని సాంకేతిక కారణాలతో ఈ ఏడాది నోటిఫికేషన్ విడుదల ఆలస్యం అయిందని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు వివరణ ఇచ్చారు.

Next Story