విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఆయుష్ కోర్సుల దరఖాస్తు గడువు పెంపు

by Kema Shiva Kumar |

కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్ యూహెచ్ఎస్) అండర్ గ్రాడ్యుయేట్ ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును పొడిగించింది.

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఆయుష్ కోర్సుల దరఖాస్తు గడువు పెంపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్ యూహెచ్ఎస్) అండర్ గ్రాడ్యుయేట్ ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును పొడిగించింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ అనుబంధ కళాశాలల్లోని బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్ వైఎస్ కోర్సుల్లో స్టేట్ కోటా కింద, ప్రైవేట్ హోమియోపతి కళాశాలల్లోని బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ఆల్ ఇండియా కోటా కింద ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ అవకాశం కల్పించారు. యూనివర్సిటీ గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం చివరి తేదీ గత నెల 29 కాగా.. ఇప్పుడు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల గడువును అక్టోబర్ 8 రాత్రి 11:30 గంటల వరకు పొడిగించినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రకటించారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Next Story