Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇవాళ అర్దరాత్రి నుంచి కొత్త చార్జీలు అమల్లోకి

by Prasad Jukanti |   (  Updated:2025-06-30 13:25:25  IST  )

అర్ధరాత్రి నుంచి కొత్త రైల్వే చార్జీలు, టికెట్ బుకింగ్ సేవలు అమల్లోకి రాబోతున్నాయి.

Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇవాళ అర్దరాత్రి నుంచి కొత్త చార్జీలు అమల్లోకి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇవాళ అర్థరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి రైల్వే చార్జీలు (Increases Fares), టికెట్ బుకింగ్ లో మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. కొత్త చార్జీలతో పాటు, తత్కాల్ టికెట్ బుకింగ్ లో (Tatkal Ticket Booking) ఆధార్ తప్పనిసరి విధానం అమల్లోకి తీసుకుబోతున్నారు. సెకండ్ క్లాస్ ఆర్డినరీకి 0 నుంచి 500 కిలోమీటర్ల వరకు సాధారణ చార్జీలు, 501 కిలోమీటర్ల నుంచి 1500 కిలోమీటర్ల వరకు టికెట్ పై రూ.5 పెంచారు. 1501 కిలోమీటర్ల నుంచి 2500 కిలోమీటర్ల వరకు టికెట్ పై రూ. 10, 2501 కిలోమీటర్ల నుంచి 3 వేల కిలోమీటర్ల వరకు టికెట్ పై రూ. 15 పెంచారు. ఆర్డినరీ స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఆర్డినరీ టికెట్లపై కిలోమీటర్ కు అర పైసా, మెయిల్ లేదా ఎక్స్ ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ టికెట్లపై కిలోమీటర్ కు ఒక పైసా పెంచారు. నాన్ ఏసీ ఫస్ట్, సెకండ్ క్లాస్, స్లీపర్ టికెట్లపై కిలోమీటర్ కు ఒక పైసా చొప్పున పెంచారు. ఈ మేరకు ఈ మార్పులు ఇవాళ అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయని అన్ని జోన్ల మేనేజర్లకు రైల్వే బోర్డు (Indian Railways) సర్క్యూలర్ జారీ చేసింది. రిజర్వేషన్ చార్జ్, సూపర్ ఫాస్ట్ సర్ చార్జీల్లో మార్పు ఉండదని, ఇప్పటికే రిజర్వేషన్ చేసిన టికెట్లకు పెంచిన చార్జీలు అమలు కావని రైల్వే బోర్టు స్పష్టం చేసింది. కాగా రైల్వే టికెట్ ధరలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నదన్న వార్తల నేపథ్యంలో కేంద్ర రైల్వే సహాయ మంత్రి వి.సోమన్న రెండు రోజుల క్రితం స్పందిస్తూ ప్రయాణికులపై ప్రభావం పడకుండా దశలవారీగా రైల్వే చార్జీలను పెంచుతామని చెప్పిన సంగతి తెలిసిందే.

Next Story