- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ లో భారీ వర్షం.. రాబోయే కొన్ని గంటలు అలర్ట్!
హైదరాబాద్ నగర ప్రజలకు అలర్ట్. అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగర ప్రజలకు అలర్ట్. అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. సిటీలోని సికింద్రాబాద్, బషీర్ బాగ్, అల్వాల్, జూబ్లీహిల్స్ , పంజాగుట్ట, మణికొండ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రాబోయే కొన్ని గంటల్లో GHMC వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా పడవచ్చని పేర్కొంది. ఈ మేరకు మ్యాప్ కూడా విడుదల చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో చాలా ప్రాంతాలలో విద్యుత్ సరఫరా కూడా ఆపేశారు అధికారులు. దీంతో హైదరాబాద్ వాసులు చీకట్లోనే ఉన్నారు. అటు అత్యవసరం అయితే, తప్ప బయటకు రావొద్దని హైదరాబాద్ వాసులకు సూచనలు కూడా చేస్తున్నారు అధికారులు. ఇక అటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. నిన్న రాత్రి నుంచి జగిత్యాల జిల్లాలో ఎగతెరపు లేకుండా వర్షం కురుస్తోంది. ఇవాళ కూడా ఉత్తర తెలంగాణలో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.






