- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రయాణికులకు బిగ్ అలర్ట్... వరదల వల్ల రద్దైన రైళ్లు ఇవే
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బిక్నూరు మండలం తలమండ్ల సెక్షన్‌లో రైల్వే ట్రాక్‌పై వరద నీరు ప్రవహిస్తుండటంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నిటిని దారి మళ్లించింది. అక్కన్నపేట-మెదక్ సెక్షన్‌లోనూ కొన్ని రైళ్లను దారి మళ్లించగా, కొన్నిటిని పాక్షికంగా రద్దు చేసారు. రాకపోకలపై ప్రభావం పడింది.కాగా ముంబై-లింగంపల్లి (దేవనగరి ఎక్స్‌ప్రెస్), లింగంపల్లి-ముంబై, ఓఖా-రామేశ్వరం, భగత్ కి కోఠి-కాచిగూడ, నిజామాబాద్-తిరుపతి (రాయలసీమ ఎక్స్‌ప్రెస్)రైళ్లు దారిమళ్లించగా, నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్సప్రెస్ ను రద్దు చేశారు. అలాగే కాచిగూడ-మెదక్ రైలు పాక్షికంగా రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే X ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేసింది.
మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు కురుస్తున్న కుండపోత వర్షాలతో నిజామాబాద్ జిల్లా సాలుర వద్ద మంజీర నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో రైతుల పంట పొలాలు, ఇళ్ళు నీటమునిగాయి. ఈ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై దిశానిర్దేశం చేశారు.






