వాహనదారులకు బిగ్ అలర్ట్.. హిమాయత్‌ సాగర్‌ ORR సర్వీస్‌ రోడ్డు మూసివేత

by Kema Shiva Kumar |

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ (Himayath Sagar) జలాశయం నిండు కుండలా మారింది.

వాహనదారులకు బిగ్ అలర్ట్.. హిమాయత్‌ సాగర్‌ ORR సర్వీస్‌ రోడ్డు మూసివేత
X

దిశ, వెబ్‌డెస్క్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ (Himayath Sagar) జలాశయం నిండు కుండలా మారింది. ఎగువ నుంచి వరద నీరు భారీ స్థాయిలో వస్తుండటంతో ఇప్పటికే 4 గేట్లను జలమండలి అధికారులు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. రాజేంద్రనగర్‌ నుంచి హిమాయత్‌ సాగర్‌ వైపు సర్వీస్‌ రోడ్డుపై భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఆ రోడ్డును పూర్తిగా మూసి వేశారు. రాజేంద్రనగర్ సమీపంలో రోడ్డుకు ఇరువైపులా పోలీసులు పత్యేకంగా రోడ్డు వెంట బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను మళ్లిస్తూ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా మూసీ నది (Musi River) ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.

Next Story