రాష్ట్రంలోని జర్నలిస్టులకు బిగ్ అలర్ట్.. కమిషనర్ ప్రియాంక కీలక ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-18 14:21:29  IST  )

తెలంగాణ ప్రభుత్వం జీవో నెం.252 ప్రకారం అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించింది.

రాష్ట్రంలోని జర్నలిస్టులకు బిగ్ అలర్ట్.. కమిషనర్ ప్రియాంక కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం కొత్త అక్రిడిటేషన్ కార్డుల (Accreditation Cards)ను జారీ చేయనున్న విషయం తెలిసిందే. జీవో నెం.252 ప్రకారం ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక (CH Priyanka) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాతో పాటు ఫ్రీలాన్స్, వెటరన్ జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

అర్హులైన జర్నలిస్టులు http://ipr.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 9 నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని, అక్రిడిటేషన్ల దరఖాస్తు, కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా (Rolling Basis) కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకునే సమయంలో జర్నలిస్టులకు ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే, వాటి పరిష్కారం కోసం మీడియా రిలేషన్స్ విభాగాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. సందేహాల కొరకు హెల్ప్ లైన్ నంబర్ 9154170881‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ హెల్ప్‌లైన్ కార్యాలయం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తుందని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక వెల్లడించారు.

Next Story