ఇంటర్మీడియట్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-14 07:11:54  IST  )

తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈనెల 16వ తేదీని విడుదల కానున్నాయి.

ఇంటర్మీడియట్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ (Telangana) ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్ర ఇంటర్ బోర్డు బిగ్ అలర్ట్ జారీ చేసింది. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు (Intermediate Advanced Supplementary Examinations Result) ఈనెల 16వ తేదీన విడుదల చేయనుంది. సోమవారం మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో తెలిపారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి మే 29 వరకు నిర్వహించారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సహా మార్కులు పెంచుకోవాలనుకునే విద్యార్థులు కూడా ఈ పరీక్షలు రాశారు. దీంతో ఈసారి ఇంటర్ సప్లిమెంటరీలో విద్యార్ధుల సంఖ్య భారీగా పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 4.2 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. జోసా కౌన్సెలింగ్‌, ఈఏపీసెట్, నీట్‌ వంటి ప్రవేశాలకు ఇంటర్‌ మార్కులు కీలకం కానుండటంతో విద్యార్ధులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.

Next Story