- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నదాతలకు బిగ్ అలర్ట్.. మరో మూడు రోజులు మాత్రమే చాన్స్
అన్నదాతలకు పెట్టుబడి సాయంతో పాటు వారిని అర్థికంగా బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పాదకత పెంచడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ (Telangana Government) ‘రైతు భరోసా’ (Rythu Bharosa) పథకానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే.

దిశ, వెబ్‌డెస్క్: అన్నదాతలకు పెట్టుబడి సాయంతో పాటు వారిని అర్థికంగా బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పాదకత పెంచడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ (Telangana Government) ‘రైతు భరోసా’ (Rythu Bharosa) పథకానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతులకు ప్రతి ఎకరానికి సంవత్సరానికి రూ.12 వేల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని రెండు విడతల్లో వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. భూ భారతి (Bhu Bharathi) (ధరణి) పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగిన పట్టాదారు రైతులు ఈ పథకానికి అర్హులు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ బుక్కులు పొందిన రైతలకు ఈ వానాకాలం సీజన్ నుంచి ‘రైతు భరోసా’ అమలు చేయనున్నట్లుగా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 5 వరకు పాస్ బుక్కులు పొందిన వారి నుంచి కొత్తగా దరఖాస్తులను స్వీకరిస్తుంది. అయితే, అందుకు గడువు ఈనెల 20తో ముగుస్తుండటంతో పాస్‌బుక్, బ్యాంక్ ఖాతా, ఆధార్ జిరాక్స్‌లతో సంబంధిత ఏఈవోల వద్ద రైతులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ప్రకటించారు. వెరిఫికేషన్ పూర్తయ్యాక అర్హులైన వారి ఖాతాలో పెట్టుబడి సాయాన్ని వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు.






