బాణాసంచా విక్రయదారులకు బిగ్ అలర్ట్.. పోలీసుల కీలక ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-10 09:03:40  IST  )

దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా విక్రయాలపై హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) కీలక ప్రకటన చేశారు.

బాణాసంచా విక్రయదారులకు బిగ్ అలర్ట్.. పోలీసుల కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా విక్రయాలపై హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు నగర పరిధిలో తాత్కాలికంగా ఫైర్ క్రాకర్లను విక్రయించే వారికి ఎక్స్‌ప్లోసివ్స్ యాక్ట్-1983 ప్రకారం లైసెన్స్‌లు జారీ చేయనున్నట్లుగా సీటీ పోలీస్ కార్యాలయం నుంచి ఇవాళ నోటిఫికేషన్ వెలువడింది. అనుమతి లేకుండా ఎవరైన బాణాసంచా విక్రయిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. లైసెన్స్‌లకు సంబంధించి మాన్యువల్‌గా ఫామ్ AE-5 ద్వారా అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.

అయితే, దరఖాస్తుదారులు అప్లికేషన్లతో పాటు విజనల్ ఫైర్ ఆఫీసర్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC), పెట్టే షాపు ప్రభుత్వ భూమి అయితే GHMC అధికారుల నుంచి లాండ్ పర్మీషన్, పట్టా భూమి అయి యజమాని నుంచి పర్మీషన్, మునుపటి సంవత్సరంలో జారీ చేయబడిన లైసెన్స్ కాపీ, పెట్టబోయే షాప్ సైట్ ప్లాన్ (బ్లూ ప్రింట్ కాపీ)తో పాటు రూ.600 లైసెన్స్ ఫీజు రశీదు (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ట్రెజరీ బ్రాంచ్, గన్‌ఫౌండ్రీ, హైదరాబాద్‌ నుంచి డీడీ)ను జత చేయాలన్నారు. అయితే, అన్ని అనుమతి పత్రాలు లేని పక్షంలో దరఖాస్తులు నేరుగా తిరస్కరించబడతాయని హైదరాబాద్ పోలీసులు నోటిపికేషన్‌లో పేర్కొన్నారు.





Next Story