- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. రాకపోకలు నిలిపివేత
by Malleboina Mahesh |
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా.. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలం మల్లికార్జున స్వామి (Srisailam Mallikarjuna Swamy) వారిని ప్రధాని దర్శించుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు శ్రీశైలం రహదారిపై రాకపోకలపై ఆంక్షలు పెట్టారు. ఈ నెల 16న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలానికి రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తాజా ఆదేశాల ప్రకారం.. హైదరాబాద్- శ్రీశైలం, దోర్నాల- శ్రీశైలం రహదారి మార్గాల్లో వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు.
Next Story






