అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. TG SET-2025 నోటిఫికేషన్‌ విడుదల

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల కోసం తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్-2025 (TG SET-2025)కు ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలైంది.

అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. TG SET-2025 నోటిఫికేషన్‌ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల కోసం తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్-2025 (TG SET-2025)కు ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలైంది. TG SET-2025 పరీక్ష డిసెంబర్ 2025 రెండో వారం‌లో జగనున్నాయి. ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించనున్నారు. పరీక్ష రెండు పేపర్లుగా ఉండనుంది. పేపర్-1లో 50 ప్రశ్నలు, పేపర్-2లో 100 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు 300లకు గాను ప్రతి పేపర్ కోసం 3 గంటల సమయం ఇవ్వనున్నారు. అయితే, పేపర్-1, పేపర్-2లో అభ్యర్థులు ఉత్తీర్ణులు అయితే.. అసిస్టెంట్, లెక్చరర్ పోస్టులకు అర్హులు అవుతారు. TG SET-2025 కోసం అభ్యర్థులకు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్స్ అక్టోబర్ 10 నుంచి అందుబాటులో ఉంటాయి. పరీక్షలకు దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.telanganaset.org ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర సందేహాలకు Osmania University అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.in లో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి.

Next Story