అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. TG PGECET-2026 పరీక్షల షెడ్యూల్ విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-18 12:06:40  IST  )

అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న తెలంగాణ TG PGECET-2026 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.

అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. TG PGECET-2026 పరీక్షల షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TG PGECET-2026 ఆన్‌లైన్ పరీక్షల షెడ్యూల్‌ను జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ (JNTUH), తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) సంయుక్తంగా విడుదల చేశాయి. ఈ ఏడాది మే 28 నుంచి మే 31 వరకు 4 రోజుల పాటు ఈ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 19 సబ్జెక్టులకు గానూ ఈసారి 26,005 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (CS) కి 10,006 మంది, ఫార్మసీ (PY) కి 8,248 మంది దరఖాస్తు చేసుకోగా.. అత్యల్పంగా టెక్స్‌టైల్ టెక్నాలజీకి కేవలం 10 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.

పరీక్షల సమయాలు ఇలా..

పరీక్షలు ప్రతిరోజూ రెండు సెషన్లలో జరగుతాయి. ఫస్ట్ సెషన్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వరకు, సెకండ్ సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష కొనసాగుతుంది. మే 28న ఉదయం సెషన్‌లో జియో-ఇంజనీరింగ్ & జియో-ఇన్ఫర్మాటిక్స్ (GG), ఫార్మసీ (PY) పరీక్షలు ఉంటాయి. మధ్యాహ్నం సెషన్‌లో సివిల్ ఇంజనీరింగ్ (CE) పరీక్ష జరుగుతుంది. మే 29న ఉదయం సెషన్‌లో ఈసీఈ (EC), బయో-టెక్నాలజీ (BT), మెకానికల్ ఇంజనీరింగ్ (ME) పరీక్షలు ఉంటాయి. మధ్యాహ్నం సెషన్‌లో ఈఈఈ (EE), ఫుడ్ టెక్నాలజీ (FT), ఏరోస్పేస్ ఇంజనీరింగ్ (AS) పరీక్షలు జరుగుతాయి. అదేవిధంగా మే 30న ఉదయం సెషన్‌లో ఇన్‌స్ట్రుమెంటేషన్ (EI), కెమికల్ (CH), టెక్స్‌టైల్ టెక్నాలజీ (TX) పరీక్షలు ఉంటాయి. మధ్యాహ్నం సెషన్‌లో ఆర్కిటెక్చర్ & ప్లానింగ్ (AR), బయోమెడికల్ ఇంజనీరింగ్ (BM) పరీక్షలు జరుగుతాయి. చివరగా మే 31న ఉదయం సెషన్‌లో మైనింగ్ (MN), ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ (EM) పరీక్షలు ఉంటాయి. మధ్యాహ్నం సెషన్‌లో మెటలర్జికల్ (MT), నానోటెక్నాలజీ (NT), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (CS) పరీక్షలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు.

Next Story