- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. PG మెడికల్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (కే.ఎన్.ఆర్.యూ.హెచ్.ఎస్) 2025–26 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (కే.ఎన్.ఆర్.యూ.హెచ్.ఎస్) 2025–26 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ (NEET-PG–2025)లో అర్హత సాధించిన అభ్యర్థులు అక్టోబర్ 1-8 వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. తెలంగాణకు చెందిన లోకల్ అభ్యర్థులు మాత్రమే ఈ సీట్లకు అర్హులు. అభ్యర్థులు ఎంబీబీఎస్(MBBS) డిగ్రీ పూర్తి చేసి, 2025 జూలై 31లోపు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి శాశ్వత రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా పొందిన వారు మాత్రమే అర్హులని పేర్కొంది. కట్‌ఆఫ్ మార్కులు జనరల్, ఈడబ్ల్యుఎస్ - 50 శాతం పర్సంటైల్ (276 మార్కులు), జనరల్ పీడబ్ల్యుడీ - 45 శాతం పర్సంటైల్ (255 మార్కులు), ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈ మూడు కేటగిరిలోని (పీడబ్ల్యుడీ) - 40 శాతం పర్సంటైల్ (235 మార్కులు) ఉండాలని నిర్ణయించారు. ఓజీ, బీసీ అభ్యర్థులకు రూ.10,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.8,000 చొప్పునా ఫీజు చెల్లించాలని సూచించారు. విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో తుది సీట్ల సంఖ్య, కౌన్సెలింగ్ తేదీలను వేరుగా ప్రకటిస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్లు http://knruhs.telangana.gov.in , https://tspgmed.tsche.inలో సంప్రదించాలని పేర్కొన్నారు.






