- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. LT పోస్టుల మెరిట్ జాబితా విడుదల
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ (LT) పోస్టుల మెరిట్ జాబితాను ఎట్టకేలకు ఇవాళ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ (LT) పోస్టుల మెరిట్ జాబితాను ఎట్టకేలకు ఇవాళ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ఈ మేరకు త్వరలోనే అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సెలక్షన్ లిస్ట్ విడుదల కాగానే రాష్ట్ర వ్యాప్తంగా 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ కానున్నాయి. కాగా, గతేడాది 1,284 ల్యాబ్ టెక్నీషియన్ భర్తీకి రాత పరీక్షలను నిర్వహించారు. అయితే సర్టిఫికెట్ల ఆధారంగా అభ్యర్థులకు ఇచ్చిన వెయిటేజీపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అదేవిధంగా కొందరు అభ్యర్థులు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టినట్లుగా మెడికల్ బోర్డు దృష్టి వచ్చింది. దీంతో అభ్యర్థులు ఇచ్చిన సర్టిఫికేట్లు ఒరిజినలా లేక ఫేకా అని తేల్చేందుకు వాటిని ఆయా జిల్లాల డీఎంహెచ్‌వోలకు పంపారు. ఈ క్రమంలోనే మెరిట్ లిస్ట్ జాబితా రూపొందించడంలో ఆలస్యం అయింది. ఈ విషయంలో అభ్యర్థులు మెడికల్ బోర్డు ముట్టడికి పిలుపునిచ్చిన విషయం కూడా తెలిసిందే.






