TGPSC:అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రేపు గ్రూప్-2 ‘కీ’ విడుదల

by Jakkula.Mamatha |   (  Updated:2025-01-17 13:18:00  IST  )

గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.

TGPSC:అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రేపు గ్రూప్-2  ‘కీ’ విడుదల
X

దిశ,వెబ్‌డెస్క్: గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణలో ఇటీవల జరిగిన గ్రూప్‌–2 (TGPSC Group 2) పరీక్ష ఆన్సర్‌ కీ కోసం అభ్యర్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల(జనవరి 8) TGPSC గ్రూప్-3 ఆన్సర్ కీ ని విడుదల చేసింది. ఇకపోతే 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి డిసెంబర్ 15, 16వ తేదీల్లో టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. 2 రోజుల పాటు నాలుగు సెషన్లలో గ్రూప్–2 పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 1,368 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరిగాయి.

గ్రూప్-2 పరీక్షకు మొత్తం 5.57 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా టీజీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమినరీ కీ(Preliminary key) విడుదల పై కీలక అప్‌డేట్ వచ్చింది. గ్రూప్-2 కీ రేపు(శనివారం) విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ(TGPSC) వెల్లడించింది. ఈ క్రమంలో జనవరి 18 నుంచి 22 వరకు అభ్యర్థుల లాగిన్‌లో ప్రాథమిక కీ, మెయిన్ ప్రశ్నా పత్రాలు అందుబాటులో ఉండనున్నాయి. ఇక జవాబు కీ లో సందేహలకు ఈ నెల 18 నుంచి 22 వరకు కీ లో అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆన్‌లైన్ ద్వారా తెలపాలని టీజీపీఎస్సీ వెల్లడించింది.

Next Story