BIG Alert: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ముసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత

by Kema Shiva Kumar |

కుండపోత వర్షంతో హైదరాబాద్ (Hyderbad) మహానగరం తడిసి ముద్దవుతోంది.

BIG Alert: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ముసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత
X

దిశ, వెబ్‌డెస్క్: కుండపోత వర్షంతో హైదరాబాద్ (Hyderbad) మహానగరం తడిసి ముద్దవుతోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురుకు ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయి జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. పలుచోట్లు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇక లోతట్టు ప్రాంతాల్లోని పలు కాలనీలు జల దిగ్భంధంలో ఉన్నాయి. అదేవిధంగా వరుస వర్షాల కారణంగా మూసీ నది (Musi River)కి వరద పోటెత్తుతోంది. వికారాబాద్ (Vikarabad) జిల్లా చించల్‌పేట సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసీలు కలుస్తున్నా కాలువలు, వాగులు ఎట్టి పరిస్థితుల్లో దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఈ క్రమంలోనే మూసీ నది వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకుని హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు (Hyderabad Traffic Police)లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరుకు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ముసారాంబాగ్ బ్రిడ్జ్‌ (Moosarambagh Bridge)పై వన్‌వే రహదారిని మూసివేశారు. మూసీ పరివాహ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అటుగా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులుసూచించారు.

Next Story