- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Palla Rajeshwer Reddy : భూభారతి చీకటి చట్టం : పల్లా రాజేశ్వర్ రెడ్డి
భూభారతి చీకటి చట్టమని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(BRS MLA Palla Rajeshwer Reddy).

దిశ, వెబ్ డెస్క్ : భూభారతి చీకటి చట్టమని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(BRS MLA Palla Rajeshwer Reddy). అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మాన్యూవల్ పహాణిలతో అక్రమాలకు అవకాశం ఉందని, మ్యూటేషన్ ఆలస్యంతో మళ్ళీ అవినీతికి ఆస్కారం ఉందని పేర్కొన్నారు. ధరణి(Dharani)పై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి 52లక్షల ఎకరాల భూమి ధరణిలో రైతుల పేరు మీద ఉందని తెలిపారు. ధరణి రిజిస్ట్రేషన్ పక్రియను సులభతరం చేసిందని, అధికారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలిపారు. గ్రామాల్లోకి మళ్లీ అక్రమార్కులను తీసుకుని రాబోతున్నారని, గ్రామాల్లో మళ్లీ గొడవలు మొదలవుతాయని ఆరోపించారు. 86సంవత్సరాల తర్వాత కేసీఆర్(KCR) భూ రికార్డులను సమగ్ర ప్రక్షాళన చేశారని తెలిపారు. వంద రోజులు క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించి రికార్డులు ఖరారు చేశారని వివరించారు. ధరణి లోపాలను సరిదిద్దకుండా దళారుల ప్రమేయం ప్రవేశపెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ భూములు ఎవరికీ తాకట్టు పెట్టలేదని, ధరణి సాఫ్ట్ వేర్‌నే భూభారతి(BhuBharathi)లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం వాడబోతున్నది అన్నారు. అనుభవదారు కాలమ్ పెట్టి మళ్ళీ రైతులకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు.






