Bhatti Vikramarka : ముగిసిన భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటన

by Muthe.Rajitha |

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka).. జార్ఖండ్(Jarkhand), ఢిల్లీ(Delhi) పర్యటనలు ముగిశాయి.

Bhatti Vikramarka : ముగిసిన భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటన
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka).. జార్ఖండ్(Jarkhand), ఢిల్లీ(Delhi) పర్యటనలు ముగిశాయి. జార్ఖండ్ ఎన్నికల ఇంచార్జ్ గా ఉన్న భట్టి విక్రమార్క.. ముందుగా అక్కడికి వెళ్ళి, పలువురు నేతలతో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహం గురించి చర్చించారు. ఆ సమావేశం అనంతరం.. నేరుగా ఢిల్లీ చేరుకొని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venugopal) తో సంవేశం అయ్యారు. జార్ఖండ్ లో ఎన్నికలు, ప్రస్తుత పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీకి నివేదించారు.అనంతరం కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శితో ప్రత్యేక సమావేశం అయిన భట్టి.. తెలంగాణ ఆర్థిక పరిస్థితుల గురించి వివరించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వినతి పత్రం అందజేశారు. కొద్దిసేపటి క్రితమే తన పర్యటనలు ముగించుకున్న డిప్యూటీ సీఎం తిరిగి హైదరాబాద్ బయలుదేరినట్లు సమాచారం.

Next Story