Bhatti: ప్రభుత్వంలో పవర్ షేరింగ్ పై ఢిల్లీ వేదికగా భట్టి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |

పవర్ షేరింగ్ పై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bhatti: ప్రభుత్వంలో పవర్ షేరింగ్ పై ఢిల్లీ వేదికగా భట్టి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పవర్ షేరింగ్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక తరహాలో మా ప్రభుత్వంలో పవర్ షేరింగ్ (Power Sharing) ఏమీ లేదని చెప్పారు. అందరం కలిసికట్టుగా టీమ్ వర్క్ చేస్తున్నామన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ అక్కడ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల మాటలు మితిమీరిపోతున్నాయి. కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు.. జనాల్లోకి వెళ్లట్లేదని విమర్శించారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చేది లేదన్నారు. ఫోర్త్ సిటీ పనులు జరుగుతున్నాయని మూసీ సుందరీకరణ ఈ ప్రభుత్వ హాయంలోన పూర్తవుతుందన్నారు. గాంధీ ఘాట్ వరకు సుందరీకరణ జరిగి తీరుతుందన్నారు. సన్నబియ్యం కార్యక్రమం విజయవంతమైంది. గత ప్రభుత్వంలో మాదిరిగా సన్నబియ్యం పక్కదారి పట్టడం లేదన్నారు. మహిళళకు ఉచిత బస్సు పథకానికి మంచి స్పందన ఉందని మరో మూడు వేల బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. సిగాచీ పరిశ్రమ ప్రమాదంపై విచారణకు ఆదేశించామని చెప్పారు. రూ.2 లక్షలు దాటిన వారికి రుణమాఫీ చేయొద్దన్నది విధాన నిర్ణయం అని రేషన్ కార్డు ఆధారంగానే కుటుంబంలో రుణమాఫీ చేశామన్నారు.

Next Story