- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో ఎక్కడా ఇంత గొప్ప కార్యక్రమం లేదు: డిప్యూటీ సీఎం భట్టి
దేశంలో ఎక్కడా ఇంత గొప్ప కార్యక్రమం లేదు: డిప్యూటీ సీఎం భట్టి

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్‌లో శుక్రవారం జరిగిన ప్రజావాణి రెండవ వార్షికోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల సమస్యలను విని వాటికి పరిష్కారం చూపే ఈ ప్రజావాణి కార్యక్రమం నిజమైన ప్రజా పరిపాలనకు ప్రతిరూపమన్నారు. దేశంలో ఇంత సమర్థంగా ప్రజా గోడు విని పరిష్కరిస్తున్న కార్యక్రమం ఎక్కడా లేదని తెలిపారు. ఇప్పటివరకు అందిన ప్రజావాణి దరఖాస్తుల్లో 74% సమస్యలు పరిష్కారమవడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఈ క్రమంలో కృషి చేసిన అధికారులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సాంకేతిక సహకారంతో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేయడం ద్వారా మరింత పారదర్శకంగా ప్రజావాణి కొనసాగుతుంది. ప్రజల మేలు కోసం రాష్ట్రంలోని ప్రతి వ్యవస్థ పనిచేయడం మా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ ప్రజలు అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.






