- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో కొత్త పెన్షన్‍లపై భట్టి విక్రమార్క అప్‍డేట్
జిల్లా పరిషత్ ఎన్నికలపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని, వచ్చే ఎన్నికల్లో తమకు ప్రత్యర్థులే లేరని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసి తమ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు పార్టీ పెద్దల వద్ద నుంచి టికెట్లు కన్ఫర్మ్ చేసుకుని ఎన్నికల నోటిఫికేషన్ వెయిట్ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జడ్పీ ఎన్నికలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లా పరిషత్ ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇవాళ ఖమ్మంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన.. అసెంబ్లీ, ఎంపీ, మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా సత్తా చూపించామన్నారు.
మాకు ప్రత్యర్థులే లేరు:
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ప్రత్యర్థులే లేరని భట్టి విక్రమార్క అన్నారు. మాకు పని ముఖ్యం అని ప్రచారం కాదన్నారు. పనిచేసే పార్టీలకు ప్రచారం అవసరం లేదన్నారు. ఈ నెలలోనే SIR ప్రక్రియ జరగబోతోందని ఈ ఈ అంశంపై మీడియా దృష్టి పెట్టాలన్నారు. ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలన్నారు. బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. మోటర్లకు మీటర్లు పెట్టేది లేదని సీఎం చెప్పారని స్పష్టం చేశారు. త్వరలోనే కొత్త పెన్షన్లు ఇస్తామని, ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ బీమా పథకం అమలు చేస్తామన్నారు. కేంద్రం ధాన్యం ఎందుకు తీసుకోవడం లేదని భట్టి ప్రశ్నించారు.






