- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రతీ హృదయం కోరుకుంటోంది: డిప్యూటీ CM భట్టి
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పుట్టినరోజు వేళ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఆసక్తకిర ట్వీట్ పెట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పుట్టినరోజు వేళ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఆసక్తకిర ట్వీట్ పెట్టారు. ‘లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రజల నమ్మకం, న్యాయసమాజ స్థాపనకు నడిచే మహానేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని ప్రత్యేకంగా ప్రజాభవన్‌లో మన శ్రామిక సోదర, సోదరీమణులతో కలిసి జరుపుకోవడం గర్వంగా ఉంది. GHMC పారిశుధ్య కార్మికులతో కలిసి కేక్ కట్ చేయడం.. వారితో సహపంక్తి భోజనం చేయడం నాకు ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. పేదల కష్టాలు అర్థం చేసుకునే నేత, శ్రామికుల పక్షనా నిలిచే నాయకుడి జన్మదినం, ఈ దేశానికి నూతన దిక్సూచి కావాలని శుభాకాంక్షల వెల్లువలతో కార్మికులు ఆకాంక్షించారు. నానమ్మ ఇందిరా గాంధీ శౌర్యాన్ని, తండ్రి రాజీవ్ గాంధీ త్యాగస్వరూపాన్ని ముద్దుగా ధారించుకున్న రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కావాలని ప్రతి హృదయం ఆకాంక్షిస్తోంది. జన్మదిన శుభాకాంక్షలు రాహుల్ జీ’ అని భట్టి విక్రమార్క ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ట్వీట్






