- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bhatti Vikramarka: భట్టికి హోంశాఖ! మంత్రులకు శాఖల కేటాయింపుపై ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
భట్టికి హోంశాఖ! ఢిల్లీకి సీఎం రేవంత్.. మంత్రులకు శాఖల కేటాయింపుపై కీలక చర్చలు

దిశ, డైనమిక్ బ్యూరో: సుదీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్న మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. రేవంత్ రెడ్డి టీమ్ లోకి కొత్తగా మరో ముగ్గురు మంత్రులు చేరారు. కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారంతో వారికి ఏయే శాఖలు కేటాయిస్తారనేది ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. సీఎం వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తారా లేక మొత్తం శాఖలను ప్రక్షాళన చేసి ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను సైతం మార్చివేస్తారా అనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మరికాసేపట్లో ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలతో భేటీ కాబోతున్నారు. మంత్రుల శాఖల పునర్ వ్యవస్థీకరణపై పార్టీ పెద్దలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
భట్టికి హోంశాఖ?:
మంత్రులకు శాఖల కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన నివేదికతో ఢిల్లీకి చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల వద్ద కొంత మందికి రెండు మూడు శాఖలు ఉన్నాయి. వీరిలో ఎవరెవరూ సమర్థవంతంగా పని చేస్తున్నారు ఎవరెవరూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే పూర్తి వివరాలతో ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు సీనియర్ మంత్రులకు సంబంధించి శాఖల్లో మార్పు ఉండబోతున్నట్లు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు హోంశాఖను కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్, ఇతర ముఖ్యమైన కేసులు కీలక దశలో ఉన్నాయి. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రుల ముగ్గురూ తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే కావడంతో వీరికి హోంశాఖను అప్పగించకుండా అనుభవం కలిగిన భట్టి విక్రమార్కకు (Bhatti Vikramarka) అప్పగించే యోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ, వాకిటి శ్రీహరికి మున్సిపల్ శాఖ, అడ్లూరికి ఎస్సీ సంక్షేమం, వివేక్ కు విద్యా శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఆర్థిక, పౌరసరఫరాల శాఖల మర్పుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. శ్రీధర్ బాబుకు ఐటీతో పాటు ఇతర శాఖలు కేటాయించనున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద సాధారణ పరిపాలన శాఖతో పాటు హోం శాఖ, విద్య, మున్సిపల్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశుసంవర్ధక, మైనింగ్ తదితర శాఖలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ఇతర మంత్రులకు కేటాయించే యోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం ఢిల్లీ పర్యటనలో ఉండగా మంత్రుల శాఖల కేటాయింపుపై ఇవాళ సాయంత్రం లేదా రేపటి లోగా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






