- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశం కోసం ఒక్క బీజేపీ నాయకుడు కూడా త్యాగం చేయలేదు: డిప్యూటీ CM భట్టి
కేంద్రం ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంలో మార్పు తీసుకురావడంతో పేదల పొట్టకొట్టడమేనని, వారి ఆకలి తీర్చే పథకం భవిష్యత్తులో రద్దు చేసేందుకు ఎత్తుగడలువేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్కమార్క మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రం ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంలో మార్పు తీసుకురావడంతో పేదల పొట్టకొట్టడమేనని, వారి ఆకలి తీర్చే పథకం భవిష్యత్తులో రద్దు చేసేందుకు ఎత్తుగడలువేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్కమార్క మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీలో ఉపాధి హామీ చట్టం మార్పుపై జరిగిన స్వల్పకాలిక చర్చపై ప్రసంగించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేదలకు, మధ్య తరగతి ప్రజలకు ఆర్థికంగా ఎంతో ఆదుకుందని, బీజేపీ ప్రభుత్వం పేదలను, మధ్య తరగతి ప్రజలను కార్పొరేట్ సంస్థలకు ధారదత్తం చేసేలా కొత్త చట్టాన్ని తీసుకువచ్చిందని తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, తక్షణమే కేంద్రం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని సూచించారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ఈ పథకం ఆనాడు యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. మహాత్మాగాంధీ దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని, వచ్చిన ఆరు నెలల్లో హత్య చేశారన్నారు. ఆయన రక్తం దేశం భూమి పోరల్లో కలిసి పోయిందని, సోనియా గాంధీ దేశ సమగ్రత కోసం కృషి చేశారని పేర్కొన్నారు.
ఎన్నో మార్పులకు ఈ నిర్ణయం నాంది
రాజీవ్ గాంధీ కూడా దేశం కోసం ప్రాణాలిచ్చారన్నారు. బీజేపీ నేతలు ఇప్పటివరకు దేశం కోసం ఒక్క రక్తపు బొట్టు చిందించిన నాయకులు ఉన్నారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రం తీసుకొస్తున్న చట్టంపై పూర్తిగా అవగాహన చేసుకోని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. దేశానికి కాంగ్రెస్పాలకులు అనేక రకాల సేవలందిచారని, ప్రధానంగా నెహ్రూ కుటుంబం సేవలు మరవలేనివన్నారు. భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చి భూమి లేని నిరుపేదలకు భూస్వాముల భూములను పేదవాళ్లు భూమిని పంపిణీ చేసిందన్నారు. ఇది సమాజంలో అసమానతలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. తెలంగాణలో ప్రవేశపెట్టి ల్యాండ్ టెన్నెన్సీ యాక్ట్ పేదలకు భూములపై హక్కులను కల్పించామని చెప్పారు. 14 ప్రైవేటు బ్యాంకులను స్వాధీనం చేసుకుని బ్యాంకుల జాతీయీకరణ చేయడం జరిగిందన్నారు. సామాన్యులను, పేదలను, రైతులను బ్యాంకులకు తీసుకువచ్చి లోన్లు తీసుకోవడం జరిగింది. సమాజంలో ఎన్నో మార్పులకు ఇది ఈ నిర్ణయం నాంది పలికిందన్నారు. ఫుడ్ సెక్యూరిటీ చట్టం ద్వారా ప్రతి పేదవాడికి ఆహార బద్రతను కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. దేశం నేడు అభివృద్ధి చెందడానికి ఆనాటి నాయకులు ముందు చూపు మాత్రమే.
చట్టాలకు బీజేపీ ప్రభుత్వం తూట్లు
పండిట్ నెహ్రూ, మహాత్మా గాంధీ, బాబా సాహెబ్ అంబేద్కర్ అంటే బీజేపీ ప్రభుత్వానికి ఏ మాత్రం నచ్చదని వారికి వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని మార్చేసి 60 :40 శాతానికి ఎందుకు మార్చారని, దీంత్ రాష్ట్రాల మీద భారం వేయడమే. కేంద్రానికి రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో ఆదాయం పోతుందని, కానీ కేంద్రం నుంచి రాష్ట్రాలకు తక్కువ నిధులు వస్తున్నాయ్నారు. కర్నాటక రూ.100 ఇస్తే ఆదాయం ఇస్తే కేంద్రం నుంచి రూ. 25 నుంచి 30 రూపాయలు ఇస్తున్నారు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు రూ.100 ఇస్తే రూ.35 నుంచి 40 ఇస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రూ.100 ఇస్తే రూ. 350, బీహార్ రూ. 100 ఇస్తే రూ. 650 ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు ఏం పాపం చేశాయని దేశానికి జీడీపీ ఇవ్వడమే తాము చేసిన తప్పా. ఎవరి సొమ్ము ఎవరికి ధారాదత్తం చేస్తున్నారు. పేదలకు మేలు చేసే చట్టాలకు బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. దీనిని ఖండిస్తున్నామని, కూలీలకు బేరం ఆడే శక్తిని తగ్గింస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరం. గ్రామీణ మహిళలకు ఆర్థిక సాధికారత నశించిపోతుంది. సామాజిక పరివర్తనకు ఇది గండి కొడుతుంది. ఉపాధి కూలీలందరూ నేడు మౌనంగా రోధిస్తున్నారు. పేదల పక్షాన నిలబడేందుకు మనం ఒక ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని పేర్కొన్నారు.
ఉపాధి చట్టం చర్చలో బీఆర్ఎస్లేకపోవడం దురదృష్టకరం :
సభలో జరిగే ఉపాధి చట్టం చర్చలో బీఆర్ఎస్ పాల్గొనకపోవడం దురదృష్టకరం, ఆ పార్టీ నేతలకు పేదల మీద ప్రేమ లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ లబ్ధి తప్ప ప్రజల మీద ఆలోచన లేదని విమర్శించారు. బీజేపీ తీసుకువచ్చిన చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం బీఆర్ఎస్‌కు లేదన్నారు. అంతేగాక వారికి మద్దతుగా ఉండే ఆలోచన మాత్రమే ఉంది. ఇది రాష్ట్రానికి ఏ మాత్రం మంచిది కాదన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజా ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాలు తీసుకువచ్చిన చట్టాలు సమాజంలో మార్పు సమతుల్యత కోసం తీసుకువచ్చాయని చెప్పారు. ఒకప్పుడు కూలీ పెరగాలంటే ఉద్యమాలు జరిగేవి. లాఠీ ఛార్జీలు జరిగేవి. అలాంటవి ఏమీ లేకుండా ఉపాధి కూలీ చట్టం ద్వారా ఒక్కటే సారి వంద రూపయాలు పెంచి అన్ని కల్పించేవి. నిశ్శబ్ద విప్లవం ఇది. ఈ చట్టాన్ని మార్చి సమాజాన్ని ఇబ్బందుల్లోకి నెట్టడమేనని కార్పోరేట్ శక్తులకు వంత పాడేలా కొత్త చట్టం ఉందన్నారు. కేంద్రం ప్రభుత్వం పేదల జీవితాలకు భద్రత లేకుండా చేస్తున్నారు. మాది రైట్ టు వర్క్ అనేది చట్టమైతే వారు దానిని పూర్తిగా మార్చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా పనిచేసే హక్కును మోడీ ప్రభుత్వం తీసేసింది. జాతీయ ఉపాధి హామీ పథకంలో 100 శాతం కేంద్రమే భరించాలి. చట్టంలో ఎలాంటి మార్పులు చేయకుండా యథావిధిగా కొనసాగించాలని సూచించారు.






