- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బడ్జెట్పై భట్టి కసరత్తు..ఆయా శాఖలపై ప్రీ-బడ్జెట్ సమీక్ష
తెలంగాణ బడ్జెట్ రూపకల్పనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కసరత్తు చేస్తున్నారు. సచివాలయంలో అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజల సంక్షేమం, ఉపాధి అవకాశాల పెంపు, పారిశ్రామిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని సమగ్ర బడ్జెట్ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఇవాళ రాష్ట్ర సచివాలంయలో కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, గనులు భూగర్భశాఖల ఉన్నతాధికారులతో ప్రీ-బడ్జెట్‍పై (Pre Budget Meeting) ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోయే రాష్ట్ర బడ్జెట్ నేపథ్యంలో ఆయా శాఖల ప్రాధాన్యాలు, అమలులో ఉన్న కార్యక్రమాల పురోగతి, ఉపాధి అవకాశాల విస్తరణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, గనుల రంగ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా చేపట్టాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించామన్నారు. ఈ సమావేశంలో మంత్రి గడ్డం వివేక్ తన సూచనలు తెలియజేశారు. ఆర్థిక శాఖతో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు బడ్జెట్‌కు సంబంధించిన ప్రతిపాదనలు మరియు ప్రాధాన్య అంశాలను వివరించారు.






