మహా న్యూస్ ఛానెల్ కార్యాలయానికి భట్టి విక్రమార్క

by velandi.Saikiran |

మహా న్యూస్ ఛానల్ పై ఇవాళ దాడి జరిగిన సంగతి తెలిసిందే. మిట్ట మధ్యాహ్నం... ఛానల్ పై గులాబీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల

మహా న్యూస్ ఛానెల్ కార్యాలయానికి భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్ డెస్క్ : మహా న్యూస్ ఛానల్ పై ఇవాళ దాడి జరిగిన సంగతి తెలిసిందే. మిట్ట మధ్యాహ్నం... ఛానల్ పై గులాబీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దాడి చేశారు. పార్టీ కండువా వేసుకొని మరి.. దాడి చేసినట్లు వీడియోలలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే మహా న్యూస్ ఛానల్ పై జరిగిన దాడిని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు ఖండిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ( Deputy Chief Minister Bhatti Vikramarka ) కూడా రంగంలోకి దిగారు. మహా న్యూస్ ఛానల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సంఘటన జరిగిన విషయం తెలియగానే... హుటాహుటిన బయలుదేరారు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఆయనతోపాటు ఎంపీ చామల కిరణ్ కుమార్ కూడా వచ్చారు.

అక్కడ జరిగిన.. దాడి సంఘటన గురించి... మహా న్యూస్ ఛానల్ ( Maha News Channel) సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి. ఇక అంతకుముందు.. తెలంగాణ బిసి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా.... సంఘటన స్థలానికి వెళ్లారు. అక్కడ జరిగిన పరిస్థితిని పరిశీలించి.. దాడిని ఖండించారు పొన్నం ప్రభాకర్. ఛానల్ పై దాడిని ప్రజాస్వామ్యంపై దాడి గా పేర్కొంటూ ఫైర్ అయ్యారు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar ).

Twitter link

Next Story