- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెంగళూరులో బిజీబిజీగా డిప్యూటీ సీఎం..అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరాపై అధ్యయనం
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మంగళవారం విద్యుత్ శాఖ అధికారులతో బెంగళూరు పట్టణంలో బిజీబిజీగా గడిపారు. బెంగళూరు పట్టణంలో అండర్ గ్రౌండ్ ద్వారా విద్యుత్ సరఫరా వ్యవస్థ పై ఆయన అధ్యయనం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మంగళవారం విద్యుత్ శాఖ అధికారులతో బెంగళూరు పట్టణంలో బిజీబిజీగా గడిపారు. బెంగళూరు పట్టణంలో అండర్ గ్రౌండ్ ద్వారా విద్యుత్ సరఫరా వ్యవస్థ పై ఆయన అధ్యయనం చేశారు. మొదట కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్కార్పొరేషన్ లిమిటెడ్ (కేపీటీసీఎల్) , బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ (బీఈఎస్సీఓఎం ) అధికారులతో కలిసి అండర్ గ్రౌండ్ కరెంటు సప్లై ప్రాజెక్టు పై చర్చలు జరిపారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో అండర్ గ్రౌండ్ కరెంటు సప్లై ప్రాజెక్టు పనితీరును ఆయన ఉన్నతాధికారులతో కలిసి స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బ్యాంకు రుణాలు, సాంకేతిక సమస్యలు, నష్టాలు, లాభాలు, ప్రమాదాలు తదితర అంశాలపై స్థానిక ఇంజనీర్లను డిప్యూటీ సీఎం భట్టి ప్రశ్నించారు. జనసాంద్రత అధికంగా ఉన్న పట్టణాల్లో, హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీ వంటి ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ కరెంటు వ్యవస్థ ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థల నమ్మకం, భద్రత, ఆకర్షణీయత మెరుగుపరిచే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో ఇది ఒక భాగం కావడం విశేషం. మొదట బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో కర్ణాటక పవర్ ట్రాన్స్ మిషన్కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ పాండే, బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ తదితర అధికారులు పలు అంశాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్ , టీజీ ఎస్పీడిసిఎల్ సీఎండి ముషారఫ్ఫరూఖీ లు ఈ చర్చలలో పాల్గొన్నారు. 2018–19 లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకు 7,400 కిలోమీటర్ల 11 కేవీ ఓవర్‌హెడ్ లైన్లను , వేలాది కిలోమీటర్ల పరిధిలో లో టెన్షన్ (ఎల్టీ) లైన్లను అండర్‌గ్రౌండ్ లేదా ఏరియల్ బంచ్డ్ కేబుల్స్‌గా మారుస్తున్నారు. ఒక ముఖ్యమైన కొత్త నోవేషన్గా అండర్గ్రౌండ్మార్గాల వెంబడి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఓఫ్సీ ) డక్టులను ఏర్పాటు చేసి, భవిష్యత్తులో టెలికాం సంస్థలతో లీజ్ ద్వారా ఆదాయ మార్గాలను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రధాన అంశాలపై పలు ప్రశ్నలు అడిగారు. వీటిలో ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆర్థిక నిర్మాణం, ఇందులో ఆసియా అభివృద్ధి బ్యాంక్ , గ్రామీణ విద్యుదీకరణ సంస్థ , ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల నుండి రుణాలు పొందడం.
ఇక రెండోది టెక్నికల్ లాసెస్ , విద్యుత్ ప్రమాదాల్లో తగ్గుదల , యూజీ అమలుతో సాంకేతిక నష్టాలు , ప్రమాదాలు 2 శాతం వరకు తగ్గినట్లు బీఈఎస్సీఓఎం సంస్థ తెలియజేయడం , ఇక మూడోది ఓఎఫ్సీ మౌలిక వసతుల వాణిజ్య ఉపయోగానికి సిద్ధత, బీఈఎస్సీఓఓం ప్రకారం డక్టులు సిద్ధంగా ఉన్నప్పటికీ, టెలికాం ఆపరేటర్లు , తదితరాలను (బీబీఎంపీ తో ) చివరి మైలు కు కలపడం ఇంకా కొనసాగుతోంది. ఇక నాలుగో అంశం రింగ్ మైన్ యూనిట్లు (ఆర్ఎంయూస్) , సిస్టమ్ నమ్మకం , ఫాల్ట్ సమయంలో డౌన్‌టైమ్ తగ్గించడంలో వీటి పాత్ర, ప్రాజెక్ట్ స్థాయి అమలులోని క్రమ శిక్షణపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అక్కడి అధికారులను ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం ఫ్యూచర్ సిటీ లాంటి పట్టణ గ్రీడ్ ఆధునీకరణ కార్యక్రమాల్లో ఈ అనుభవాలను ఎలా అన్వయించాలో కూడా ఆయన తెలుసుకున్నారు. ఆ తరువాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లేశ్వరంలో (15వ క్రాస్) ఏర్పాటు చేసిన పైలట్ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. అక్కడ అండర్ గ్రౌండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌తోపాటు అండర్ గ్రౌండ్ ట్రాన్స్‌ఫార్మర్ (డిటీఆర్) వ్యవస్థను అమలు చేశారు. ఈ ప్రాంగణంలో ట్రాన్స్‌ఫార్మర్లను పూర్తిగా భూమిలో పాతిన ఛాంబర్లలో ఉంచి, వీటికి వీధి స్థాయిలో సులభంగా నిర్వహణకు వీలైన ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. ఇది పట్టణ ప్రాంతాల్లో స్థల వినియోగాన్ని మెరుగుపరచడంలో , భద్రతను పెంపొందించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. ఫీల్డ్ విజిట్ సమయంలో ఉప ముఖ్యమంత్రి ఇంజినీర్లు , కాంట్రాక్టర్లతో నేరుగా మాట్లాడారు. భద్రతా నిబంధనలు, లోడ్ బ్యాలెన్సింగ్ సాంకేతికతలు , అత్యవసర మరమ్మతుల కోసం తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి ఆవిష్కరణలు ఎంతగానో ఉపయోగపడతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.






