- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bhatti: నిర్మలా సీతారామన్ తో భట్టి విక్రమార్క భేటీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. గురువారం ఢిల్లీలో పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక సంబంధిత అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో భట్టితో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, రామసహాయం రఘురాం రెడ్డి ఉన్నారు. అంతకు ముందు జీఎస్టీ రేట్ రేషనలైజేషన్ సమావేశానికి హాజరైన భట్టి విక్రమార్క రాష్ట్రాల ఆదాయాలు క్షీణించకుండా చర్యలు తీసుకోవాలని వాటాకు తగిన విధంగా దక్షిణాది రాష్ట్రాలకు నిధుల పంపిణీ జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీ ప్రవేశపెట్టిన సమయంలో రాష్ట్రాల వార్షిక వృద్ధి రేటు 14 శాతంగా ఉండటంతో, వార్షికంగా 14 శాతం వృద్ధి కలుగుతుందని హామీ ఇచ్చారని కానీ ఇప్పటి వరకు 14 శాతం వృద్ధి స్థిరపడలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రాల వార్షిక వృద్ధి కేవలం 8 నుంచి 9 శాతం మధ్యలోనే ఉందని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలలో భాగంగా రేట్ రేషనలైజేషన్ ప్రతిపాదనకు మద్దతు తెలిపినా, దానికి సరైన పరిహార యంత్రాంగం ఉండాలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.






