- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bhatti: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భట్టి విక్రమార్క భేటీ
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పీఎం కుసుమ్ పథకం కింద తెలంగాణకు ఇస్తామని చెప్పిన విధంగా 4 వేల మెగా వాట్ల సోలార్ ప్లాంట్లను మంజూరు చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ను కోరినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇవాళ ఢిల్లీలో ప్రహ్లాద్ జోషి ని కిలసిన భట్టి విక్రమార్క ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. పీఎం కుసుమ్ పథకం కింద తొలుత రాష్ట్రానికి ప్రకటించిన 4 వేల మెగావాట్ల నుంచి కేవలం 1000 మెగావాట్లకే కుదించారనే సమాచారం రావడంతో వెంటనే కేంద్ర మంత్రిని కలిసేందుకు ఇక్కడికి వచ్చామన్నారు. ముందుగా ప్రకటించినట్లుగా 4 వేల మెగా వాట్లు కొనసాగించాలని కోరామన్నారు. అలాగే రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం కింద హక్కు పత్రాలు (ఆర్‌వోఎఫ్‌ఆర్) లభించిన పోడు భూముల్లో సౌర విద్యుత్ వినియోగానికి సబ్సిడీ ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. కొత్త విద్యుత్ పాలసీలో సోలార్ విద్యుత్ కు ప్రాధాన్యం ఇచ్చామని సౌర విద్యుత్ పై స్వయం సహాయక సంఘాలతో ఒప్పందం చేసుకున్నామన్నారు.






