- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ హైకమాండ్‌ను కలిసిన భట్టి.. జార్ఖండ్ రాజకీయాలపై సమీక్ష
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఇటీవల జార్ఖండ్ పర్యటనకు వెళ్లిన భట్టి విక్రమార్క, అక్కడ తాను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు, తాజా రాజకీయ పరిణామాలను ఈ సందర్భంగా ఖర్గేకు ఆయన నివేదించారు. జార్ఖండ్‌లో త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్‌తో తాను జరిపిన చర్చల వివరాలను ఖర్గేకి భట్టి విక్రమార్క వివరించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి, ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి జరుగుతున్న ప్రయత్నాలను భట్టి విక్రమార్క ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగడంపై జార్ఖండ్ స్థానిక నాయకత్వంతో జరిపిన సంప్రదింపులను, కూటమి ఐక్యతను చాటేలా జార్ఖండ్ కాంగ్రెస్ నేతలు శ్రమిస్తున్న తీరును భట్టి విక్రమార్క ఈ సందర్భంగా ఖర్గేకి వివరించారు.
కేసీ వేణుగోపాల్‌ను కలిసిన భట్టి..
అలాగే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించిన భట్టి విక్రమార్క సీఎం హేమంత్ సోరెన్ తో, స్థానిక కాంగ్రెస్ నాయకులతో జరిపిన చర్చలు, పార్టీ వ్యవహారాలకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ కి భట్టి విక్రమార్క అందజేశారు.






