- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారమైనా సరే.. విద్యార్థుల భవిష్యత్తే మాకు ముఖ్యం: డిప్యూటీ CM భట్టి
ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee Reimbursement)పై ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee Reimbursement)పై ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో బంద్‌ను విరమించుకున్న ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ప్రకటించాయి. మంగళవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా యథావిధిగా కాలేజీలు తెరచుకోనున్నాయి. ప్రస్తుతం రూ.600 కోట్లు, దీపావళికి రూ.600 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. చర్చల అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్‌కు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.. ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవస్థను బీఆర్ఎస్ చిన్నాభిన్నాం చేసింది.. ఫీజు బకాయిల భారాన్ని బీఆర్ఎస్ మా మీద మోపింది.. ఒక్కొక్క వ్యవస్థను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నాం.. ప్రభుత్వానికి భారమైనా విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని బకాయిలు చెల్లిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.






