- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ పై కేసీఆర్ విషం కక్కుతున్నారు : భట్టి విక్రమార్క
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపైబీఆర్ఎస్ విష ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపైబీఆర్ఎస్ విష ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పినపాక గ్రామంలో నూతన సబ్‌స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో భట్టి విక్రమార్క మాట్లాడారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజల కోసమేనని, ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయడం లేదని స్పష్టం చేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించేందుకు ఏడాదికి రూ.12,500 కోట్లను విద్యుత్ శాఖకు ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. బీఆర్‌ఎస్ నేతల మాదిరిగా దిగజారి మాట్లాడలేమని, తోలు తీస్తామని చేసే వ్యాఖ్యలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. రెండేళ్లుగా అసెంబ్లీకి రాని కేసీఆర్ మీడియా సమావేశాల్లో ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు. బయట ఇన్ని మాటలు మాట్లాడుతున్న కేసీఆర్.. అసెంబ్లీకి రావడానికి మాత్రం భయపడుతున్నారని ఆరోపించారు.






