చెరువులో ఈదుకుంటూ వెళ్లిన లైన్మెన్.. అభినందించిన భట్టి విక్రమార్క

by Muthe.Rajitha |

చెరువు మధ్యలో తాడు సహాయంతో ప్రాణాలకు తెగించి వెళ్లి విద్యుత్ లైన్ పునరుద్ధరించిన లైన్మెన్ హైముద్దీన్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందించారు.

చెరువులో ఈదుకుంటూ వెళ్లిన లైన్మెన్.. అభినందించిన భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్ డెస్క్ : చెరువు మధ్యలో తాడు సహాయంతో ప్రాణాలకు తెగించి వెళ్లి విద్యుత్ లైన్ పునరుద్ధరించిన లైన్మెన్ హైముద్దీన్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందించారు. రాష్ట్రంలో కురుస్తున్న అతి భారీ వర్షాలకు చెరువులు నిండి నాలుగు పారుతున్నాయని, వాగులు వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయని.. ఈ క్రమంలో ప్రజల సౌకర్యార్థం చెరువులో ఈదుకుంటూ వెళ్లి విద్యుత్ లైన్ ను సవరించి సాహసం చేయడం నిజంగా గొప్ప విషయం అన్నారు. హైముద్దీన్ కృషి వెలకట్టలేనిది అని కొనియాడారు.

కాగా నేడు సిద్ధిపేట జిల్లా నాగసముద్రం చెరువులో విద్యుత్ లైన్ తెగిపడటంతో లైన్మెన్ హైముద్దీన్ చెరువులో తాడు సహాయంతో ఈదుకుంటూ వెళ్లి విద్యుత్ లైన్ ను సరిచేశారు. హైముద్దీన్ చేసిన సాహసం సోషల్ మీడియాలో వైరల్ అవగా.. నువ్వు గొప్పోడివి అంటూ నెటిజన్స్ సైతం ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

Next Story