- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణను నంబర్ వన్ స్థానానికి తీసుకొస్తాం: భట్టి విక్రమార్క
దేశంలో తెలంగాణను మొదటిస్థానానికి తీసుకెళ్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. దేశం, ప్రపంచం తెలంగాణ వైపు చూస్తున్నాయని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: దేశంలో తెలంగాణను మొదటిస్థానానికి తీసుకెళ్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. దేశం, ప్రపంచం తెలంగాణ వైపు చూస్తున్నాయని చెప్పారు. కులగణన చేసిన తీరును రాష్ట్రాలు తెలుసుకుంటున్నాయని అన్నారు. భట్టి విక్రమార్క నాగర్‌కర్నూల్ జిల్లాలోని పోల్కంపల్లి, బొమ్మంపల్లి, పదర సబ్‌స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు దెయ్యాలను వదిలించుకుని తమకు గెలిపించారని చెప్పారు.
దెయ్యాలకు నాయకత్వం వహించే వ్యక్తి దేవుడా అంటూ కేసీఆర్‌పై సెటైర్ వేశారు. పాలమూరు జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని, పాలమూరు ప్రాజెక్టులు వేగంగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలో ఉన్న పదేళ్లలో కేసీఆర్ గిరిజనుల గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు. భూమి లేని నిరుపేదలకు తమ ప్రభుత్వం ఏడాదికి రూ.12 వేలు ఇస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఇల్లు లేని కుటుంబం ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలకు తగ్గకుండా ఇవ్వాలని భావిస్తున్నట్టు చెప్పారు. విద్యా వ్యవస్థను కూడా గాడిలో పెడుతున్నామని వెల్లడించారు.






