- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం పెంపుపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వండి: డిప్యూటీ సీఎం భట్టి
వాణిజ్య పన్నుల శాఖలో ఆదాయం పెంచేందుకు సర్కిల్ వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ఆ శాఖ ఉన్నతాధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణ సమావేశం సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన జరిగింది.

దిశ, తెలంగాణ బ్యూరో : వాణిజ్య పన్నుల శాఖలో ఆదాయం పెంచేందుకు సర్కిల్ వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ఆ శాఖ ఉన్నతాధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణ సమావేశం సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుదిల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. వివిధ రకాల వస్తువుల వారీగా సమీక్ష చేయాలని ఆదేశించారు. కమర్షియల్ టాక్స్ విభాగానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసి ఆదాయం పెంపునకు మార్గాలు అన్వేషించాలి డిప్యూటీ సీఎం సూచించారు.
స్టాంప్స్, రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలో ఆదాయం పెంపునకు గత సంవత్సరం వేసిన కమిటీ, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు పరిస్థితిపై డిప్యూటీ సీఎం సమీక్షించారు. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖతో ముడిపడి ఉన్నహెచ్ఎండిఏ, జీహెచ్ఎంసి, హౌసింగ్ బోర్డు వంటి ఇతర శాఖలను సమన్వయం చేసుకొని ప్రత్యేక సమావేశం నిర్వహించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఆదాయం పెంచేందుకు అన్ని శాఖలను సమన్వయం చేసుకునే అంశాన్ని చీఫ్ సెక్రటరీ సీరియస్ గా తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం పెంపుదలకు సంబంధించి లోతుగా అధ్యయనం చేసి 15 రోజుల్లో నివేదిక తెప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును డిప్యూటీ సీఎం ఆదేశించారు.
రవాణా శాఖలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోకపోవడానికి కారణాలు వాటిని అధిగమించేందుకు అలాంటి చర్యలు తీసుకోవాలి, అవసరమైతే ప్రత్యేక పాలసీ రూపొందిస్తామని మంత్రులు తెలిపారు. ఆదాయ వనరుల సమీక్ష సమావేశానికి వచ్చే ముందు అన్ని శాఖల ఉన్నతాధికారులు ఆయా శాఖలో ఆదాయం పెంపుదలకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఒక స్పష్టమైన నివేదికతో సమావేశానికి హాజరుకావాలని డిప్యూటీ సీఎం సూచించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమర్షియల్ టాక్స్ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, స్టాప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రవాణా శాఖ కమిషనర్ సురేంద్రమోహన్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హరిత, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.






