- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా బాధ్యత: డిప్యూటీ సీఎం భట్టి
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా సర్కార్బాధ్యత , సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సబ్ కమిటీని, అధికారుల కమిటీని నియమించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా సర్కార్ బాధ్యత , సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సబ్ కమిటీని, అధికారుల కమిటీని నియమించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. బుధవారం సచివాలయంలో సబ్ కమిటీ సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు తదితరులతో కలిసి ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలపై సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగుల సమస్యలపై నియమించిన త్రీమెన్ కమిటీ ఉద్యోగ సంఘాలతో పలుమార్లు సమావేశమై విజ్ఞప్తులను స్వీకరించిందని, వారి వద్ద స్వీకరించిన సమాచారాన్ని కమిటీకి పలు దఫాలుగా ను వివరించారన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగులకు బకాయిలు పేరుకుపోవడంతో అన్ని ఒకేసారి చేయలేకపోయామని భట్టి విక్రమార్క అన్నారు. ఇక ఎక్కువ కాలం పెండింగ్‌లో పెట్టకుండా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపాలనదే ప్రభుత్వ ఆలోచన అని ఉద్యోగ సంఘాలకు వివరించారు. నేడు గురువారం క్యాబినెట్ సమావేశం నేపథ్యంలో అధికారుల నివేదికతో పాటు నేరుగా ఉద్యోగ సంఘాలతో చర్చించాలని నిర్ణయించినట్టు భట్టి విక్రమార్క తెలిపారు.
ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములు గా ప్రజా ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. ప్రజలకు చేయాల్సిన పనులు, అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ ఆదాయం, వ్యయం వీటన్నిటితో పాటు ఉద్యోగ వ్యవస్థకు ఇవ్వాల్సినవి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా భావిస్తుందని వివరించారు. ఒకవైపు ప్రజలకు మరోవైపు ఉద్యోగులకు ఇబ్బందులు కలగకుండా కలిసి కూర్చుని చర్చించుకుని ముందుకు పోవాలన్న ఆలోచనతోనే క్యాబినెట్ సమావేశానికి ముందు టీజీఈ జేఏసీ ఛైర్మన్మారం జగదీశ్వర్,సెక్రటరీ జనరల్ఏలూరు శ్రీనివాస్‌రావు, టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేనీ ముజీబ్తదితర ఉద్యోగ సంఘాలతో సమావేశమైనట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. గత పది సంవత్సరాల పాలనతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని, అయినప్పటికీ ఉద్యోగులకు సాధ్యమైనంత మేరకు మేలు చేయాలని , వారి సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచనలో భాగంగానే మా ప్రభుత్వం రాగానే మొదటి తారీకు నే జీతాలు చెల్లిస్తుందని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలు పెద్ద సంఖ్యలో తీసుకువచ్చి విజయవంతంగా అమలు చేస్తున్నామని వీటికి తోడు ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలన్న తపనలో ప్రజా ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు.
వనరులు సమకూర్చుకొని ప్రజలపై అదనంగా ఒక్క రూపాయి భారం పడకుండా ముందుకు పోతున్నాం అదే నేపథ్యంలో ఉద్యోగుల సంక్షేమం కోసం ఆర్థికపరమైన కసరత్తు చేస్తున్నామని, ఈ కసరత్తు విజయవంతం కావాలని మనసున్న ప్రభుత్వం కోరుకుంటుందని వివరించారు. ఉద్యోగులకు మంచి చేయాలన్న ఆలోచనతోనే పలుమార్లు సమావేశాలు నిర్వహించామని వివరించారు. ప్రభుత్వ ఆదాయానికి , ఖర్చుకు చేయాల్సిన పనులను బేరీజు వేసుకొని ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి బలంగా ఉన్నారని డిప్యూటీ సీఎం ఉద్యోగ సంఘాలకు భరోసా ఇచ్చారు. ఉద్యోగుల కుటుంబాల్లో పెళ్లిళ్లు, ఆసుపత్రుల ఖర్చులకు సంబంధించిన సమస్యలపై క్యాబినెట్ సహచరులం అంతర్గతంగా పలుమార్లు చర్చించుకున్నామని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్న అంశంపై ఎవరికీ భిన్నాభిప్రాయం లేదని భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం క్యాబినెట్ సమావేశం నేపథ్యంలో ఉద్యోగ సంఘాల సమస్యలపై ఏర్పాటు చేసిన అధికారుల త్రీ మెన్ కమిటీ, ఆర్థిక శాఖ, ఇతర అధికారులతో చర్చించి ఒక నివేదిక రూపొందించి క్యాబినెట్ కు నివేదిస్తామని, పరిష్కారం కూడా కనుగొంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఉద్యోగ సంఘాల నేతలకు వివరించారు. ఉద్యోగ సంఘాలతో పాటు ఈ సమావేశం లో అధికారులు నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణభాస్కర్, సందీప్ కుమార్ సుల్తానియా, మహేష్ దత్ ఎక్కా తదితరులు పాల్గొన్నారు.






