Bhatti : వైద్య శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై భట్టి సమీక్ష

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-18 11:56:20  IST  )

తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ 2025-26(Annual Budget 2025-26) రూపకల్పన కసరత్తులో భాగంగా వరుసగా వివిధ ప్రభుత్వ శాఖల బడ్జెట్ ప్రతిపాదనల(Budget Proposals)ను సమీక్షిస్తున్న డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమం శాఖ ఉన్నత అధికారులతో బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష చేశారు.

Bhatti : వైద్య శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై భట్టి సమీక్ష
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ 2025-26(Annual Budget 2025-26) రూపకల్పన కసరత్తులో భాగంగా వరుసగా వివిధ ప్రభుత్వ శాఖల బడ్జెట్ ప్రతిపాదనల(Budget Proposals)ను సమీక్షిస్తున్న డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమం శాఖ ఉన్నత అధికారులతో బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష చేశారు. ఈ సమీక్షా సమావేశానికి ఆ శాఖ మంత్రి దామోదర రాజా నర్సింహ(Damodar Raja Narasimha), అధికారులు హాజరయ్యారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం నిర్మాణం సహా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలివ వసతుల కల్పన, జిల్లా, ఏరియా ఆసుపత్రు అభివృద్ధి, మెడికల్, నర్సింగ్ కళాశాలల వసతుల కల్పన వంటి వాటికి కావాల్సిన నిధుల ప్రతిపాదనపై చర్చించారు.

వచ్చేనెలలో ప్రభుత్వం వార్షిక బడ్జెట్ 2025-26 ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్ పై కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల నుంచి ఆర్థిక శాఖకు బడ్జెట్ ప్రతిపాదనలు అందాయి. రాబడులు, వ్యయాలు, పధకాల ఖర్చులు, ఉద్యోగుల జీతభత్యాలు వంటి వాటిపై ఫ్రీ బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ స్వీకరించి సమీక్షలు చేస్తుంది. రహదారులు-భవనాలు, సినిమాటోగ్రఫీ, రవాణా, బీసీ సంక్షేమ శాఖలు, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమం, దేవాదాయ, టూరిజం, అటవీ శాఖలు సమర్పించిన ప్రతిపాదనలపై భట్టి సమీక్ష నిర్వహించారు.

శాఖల వారిగా ఫ్రీ బడ్జెట్ ప్రతిపాదనలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్న ఆర్థిక మంత్రి భట్టి వార్షిక బడ్జెట్ కు తుది రూపు ఇచ్చే కసరత్తులో నిమగ్నమయ్యారు.

Next Story