- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telangana Inter Results : ఇంటర్ ఫెయిల్ విద్యార్థులకు భట్టి కీలక సూచన
తెలంగాణ ఇంటర్ ఫలితాలు(Telangana Inter Results) మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఇంటర్ ఫలితాలు(Telangana Inter Results) మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఈ రిజల్ట్స్ ను వెల్లడించారు. ఇంటర్ ఫస్టియర్ లో 4,88,430 మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరవగా.. వారిలో 3,22,191 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇక సెకండియర్లో 5,08,582 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా.. వారిలో 3,33,908 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క విద్యార్థులకు, తల్లిదండ్రులకు పలు కీలక సూచనలు చేశారు. ముందుగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఫెయిల్ అయిన విద్యార్థులు నిబ్బరంగా ఉండాలని తెలిపారు. ఈ మార్కులు జీవితానికి కొలమానం కావని.. ముందు ముందు ఎన్నో అద్భుతాలు సాధించవచ్చని హితబోధ చేశారు.
ఫెయిల్ అయిన విద్యార్థుల్లో తల్లిదండ్రులు, అధ్యాపకులు మనో ధైర్యం నింపాలని.. ఈ సమయంలో వారికి మానసిక అండ చాలా అవసరమని అభిప్రాయ పడ్డారు. అందుకోసం ప్రభుత్వం తరుపున టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచుతున్నామని.. ఎవరైనా విద్యార్థులు ఫలితాల కుంగుబాటులో ఉంటే ఈ నంబర్లకు ఫోన్ చేసి, ఉచిత కౌన్సిలింగ్ పొందవచ్చని పేర్కొన్నారు. 1800 891 4416, 14416 ఇంటర్ బోర్డ్ టెలీమానస్ సెంటర్ల నంబర్లను తల్లిదండ్రులు, అధ్యాపకులు సేవ్ చేసుకొని.. విద్యార్థులు ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోకుండా చూడాలని, వారి నూరేళ్ళ బంగారు భవిష్యత్తుకు దోహదపడాలని భట్టి కోరారు. ఇక తల్లి దండ్రులు పిల్లలను అగౌరవ పరిచేలా మాట్లాడవద్దని, వారికి ఇష్టమైన రంగంలో ప్రోత్సహించి, అండగా నిలబడాలని సూచించారు.






