- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ తల్లి విగ్రహ ఆవశ్యకతను వివరించిన.. భట్టి
తెలంగాణ తల్లి అంటే ఒక భావన కాదని అది తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల బిడ్డల భావోద్వేమని డిప్యుటీ సీఎం భట్టీ విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు

దిశ, వెబ్ డెస్క్; తెలంగాణ తల్లి అంటే ఒక భావన కాదని అది తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల బిడ్డల భావోద్వేమని డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. ఆయన సోమవారం శాసనమండలిలో(Legislative Council) తెలంగాణ తల్లి విగ్రహ(Telangana Mother Statue) రూపకల్పనపై ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో తెలంగాణ తల్లి విగ్రహం స్వేచ్ఛ కోసం పిడికిళ్ళు బిగించి సకలజనులు ఒక్కటే అని గర్జించిన ఉద్వేగం కనిపిస్తుందన్నారు. తెలంగాణ తల్లి నిలుచున్న పీఠం మన చరిత్రకు అద్దం పట్టేలా రూపొందించామని తెలిపారు. తెలంగాణ చిరునామాని, ఉద్యమాలను, పోరాటాలను, అమరు వీరుల ఆత్మబలి దానాలను దీనికి సంకేతంగా పీఠంలో బిగించిన పిడికిళ్లను రూపొందించామని ప్రకటించారు. పోరాట యోధులు చాకలి ఐలమ్మ, సమ్మక్క సారక్కల స్ఫూర్తితో ఎంతో హుందాగా మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని తెలిపారు. ఈ విగ్రహం తెలంగాణ జాతి భావనకు జీవం పోసిందని, మన సంస్కృతి సాంప్రదాయాలకు, నిలువుటద్దంగా ఉందని ఆయన అన్నారు. తెలంగాణ చరిత్రని పరిగణలోకి తీసుకొని నిండైన రూపాన్ని ఇచ్చామని భట్టి వివరించారు.






