Bhatti: నాడు పీవీని ఇబ్బందిపెట్టినట్లే నేడు మమ్మల్నీ ఇబ్బందిపెట్టే కుట్ర: భట్టి విక్రమార్క

by Prasad Jukanti |

తమ ఉనికి ఉండదనే భయంతోనే బీఆర్ఎస్, బీజేపీ ఏకమై కాంగ్రెస్ పై దాడి చేస్తున్నాయని భట్టి విక్రమార్క ఆరోపించారు.

Bhatti: నాడు పీవీని ఇబ్బందిపెట్టినట్లే నేడు మమ్మల్నీ ఇబ్బందిపెట్టే కుట్ర: భట్టి విక్రమార్క
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణతో తమ ఉనికి ఉండదనే భయంతోనే బీఆర్ఎస్(BRS), బీజేపీ (BJP) ఏకమై కాంగ్రెస్ పై దాడి చేస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆరోపించారు. సామాజిక విప్లవానికి కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం తెరలేపిందన్నారు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. నాడు పీవీ నర్సింహారావు భూసంస్కరణలు తీసుకురావాలని ప్రయత్నిస్తే వాటిని నేరుగా వ్యతిరేకిస్తే ప్రజలు తిరగబడతారని భయపడి కుట్రపూరితంగా జై ఆంధ్ర ఉద్యమాన్ని తీసుకువచ్చి ప్రభుత్వాన్ని ఎలా ఇబ్బంది పెట్టారో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్, బీజేపీలు దాడి చేస్తున్నాయన్నారు. ఈ రాష్ట్రంలోని బహుజనులంతా ఏకమై ప్రభుత్వానికి, రాహుల్ గాంధీకి అండగా ఉంటారన్నారు.

Next Story