TG: ఆ నిర్ణయంతో రాష్ట్ర రైతులకు నష్టం: భట్టి

by Prasad Jukanti |   (  Updated:2025-09-04 11:45:31  IST  )

భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు.

TG: ఆ నిర్ణయంతో రాష్ట్ర రైతులకు నష్టం: భట్టి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను (Nirmala Sitharaman) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) కలిశారు. ఇవాళ ఢిల్లీలో సీతామన్ తో భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు, రుణాలు తదితర అంశాలపై విజ్ఞప్తులు చేశారు. పామాయిల్ పై తగ్గించిన సుంకాల వల్ల రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని నిర్మలాసీతారామన్ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న విద్యాసంస్థలకు ఆర్థిక సాయం అందించాలని ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. కాగా మరికాసేపట్లో భట్టి విక్రమార్క కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టం వివరాలను అమిత్ షాక్ వివరించనున్నారు. కేంద్రం నుంచి పరిహారం కోరే అవకాశం ఉంది.

Next Story