- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bharat summit: హైదరాబాద్ లో భారత్ సమ్మిట్ ప్రారంభం
పెట్టుబడులే లక్ష్యంగా భారత్ సమ్మిట్ ప్రారంభమైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: పెట్టుబడులు, న్యాయం, ప్రపంచ శాంతి, అహింస లక్ష్యంగా ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న భారత్ సమ్మిట్ -2025 (Bharat Summit)ప్రారంభమైంది. హైదరాబాద్ హెచ్ఐసీసీ (Hyderabad HICC) నోవాటెల్ లో జరుగుతున్న ఈ సమ్మిట్ కు 100 కు పైగా దేశాల నుంచి 450 కి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. భారత్ సమ్మిట్ కు వచ్చిన విదేశీ ప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా బోనాలు, డబ్బులతో కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ తెలిసేలా ప్రత్యేక స్టాల్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఏఐసీసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొననున్నారు.






