బండి భగీరథ్‍ను కస్టడీకి తీసుకున్న పోలీసులు.. చర్లపల్లి జైలునుంచి తరలింపు

by Prasad Jukanti |

పొక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌ను పోలీసులు చర్లపల్లి జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతించింది.

బండి భగీరథ్‍ను కస్టడీకి తీసుకున్న పోలీసులు.. చర్లపల్లి జైలునుంచి తరలింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సృష్టించలనం సృష్టించిన పొక్సో (POCSO) కేసు నిందితుడు బండి భగీరథ్‌‍ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు బండి భగీరథ్‍ను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ ఉదయం పోలీసులు చర్లపల్లి జైలుకు చేరుకున్నారు. అక్కడ బండి భగీరథ్‍ను తమ కస్టడీలోకి తీసుకున్నారు. అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి పేట్ బషీరాబాద్ పీఎస్ కు తరలించనున్నారు. కూకట్ పల్లి డీసీపీ ఆధ్వర్యంలో బండి బగీరథ్‍ను పోలీసులు ప్రశ్నించనున్నారు.

Next Story