Srinivas Goud: జనాభా లెక్కల్లోనూ తక్కువ చేసి చూపించారు

by Gantepaka Srikanth |

శ్రామిక కులాల్లోని మహానీయులను గుర్తించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ అన్నారు. భగీరథ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో వేడుకలు నిర్వహించారు.

Srinivas Goud: జనాభా లెక్కల్లోనూ తక్కువ చేసి చూపించారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: శ్రామిక కులాల్లోని మహానీయులను గుర్తించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ అన్నారు. భగీరథ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో వేడుకలు నిర్వహించారు. తమ హయాంలో భగీరథ జయంతిని అధికారికంగా నిర్వహించామని చెప్పారు. భగీరథ పేరిట మిషన్ భగీరథను తీసుకొచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వృత్తి కులాలకు ఎన్నో చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఒక్కటి కూడా నెరవేరలేదని అన్నారు. జనాభా లెక్కల్లోనూ తక్కువ చేసి చూపారని ఆరోపించారు. కేంద్రం సక్రమంగా జనగణన, కులగణన చేసి శ్రామిక కులాలకు అన్నిరంగాల్లోనూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యతోపాటు చట్టసభల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు జి.దేవిప్రసాద్, చిరుమళ్ల రాకేష్ కుమార్, కె.కిషోర్ గౌడ్, తుంగబాలు, జూలూరు గౌరీశంకర్, సుమిత్రా ఆనంద్, సుశీలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story