నేను బీఆర్‌ఎస్‌ సభ్యత్వం రద్దు చేసుకోలేదు: ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) జరిగిన సమావేశంపై భద్రాచలం(Bhadrachalam) ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు(Tellam Venkat Rao) స్పందించారు.

నేను బీఆర్‌ఎస్‌ సభ్యత్వం రద్దు చేసుకోలేదు: ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) జరిగిన సమావేశంపై భద్రాచలం(Bhadrachalam) ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు(Tellam Venkat Rao) స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్పీకర్‌ నోటీసులకు సమాధానం ఇవ్వడానికే వెళ్లినట్లు చెప్పారు. సీఎం రేవంత్‌తో భేటీ కేవలం ఐదు నిమిషాలే జరిగిందని చెప్పారు. భారీవర్షాలకు భద్రాచలం నియోజకవర్గంలో రోడ్లు దెబ్బతిన్నాయి. నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్‌ను కోరానని అన్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. తాను ఇంకా బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వం రద్దు చేసుకోలేదు.. దాంతో పాటు కాంగ్రెస్‌లో సభ్యత్వం కూడా తీసుకోలేదని అన్నారు. అభివృద్ధి కోసం ఏ పార్టీతోనైనా కలిసి నడుస్తా అని కీలక ప్రకటన చేశారు. భద్రాద్రి డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య సీనియర్.. పొదెం వీరయ్య ఏమన్నా కలిసి నడుస్తా అని అన్నారు.

Next Story