- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘చైన్’ మాయలో పడితే చెరసాలకే.. మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలతో జాగ్రత్త
‘మీకు మీరే బాస్.. రోజుకు రెండు గంటలు పనిచేస్తే నెలకు లక్షల్లో సంపాదన.. సొంతంగా ఓ టీమ్ రెడీ చేసుకోండి’.. సోషల్ మీడియాలో ఇలాంటి ప్రకటనలు చూసి టెంప్ట్ అవుతున్నారా..?.. అయితే మీరు మోసగాళ్ల వలలో పడబోతున్నట్లే..

దిశ, తెలంగాణ బ్యూరో : ‘మీకు మీరే బాస్.. రోజుకు రెండు గంటలు పనిచేస్తే నెలకు లక్షల్లో సంపాదన.. సొంతంగా ఓ టీమ్ రెడీ చేసుకోండి’.. సోషల్ మీడియాలో ఇలాంటి ప్రకటనలు చూసి టెంప్ట్ అవుతున్నారా..?.. అయితే మీరు మోసగాళ్ల వలలో పడబోతున్నట్లే.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావచ్చనే అత్యాశతో మల్టీలెవల్ మార్కెటింగ్.. ఎంఎల్ఎం చైన్ సిస్టమ్ నెట్‌వర్క్‌లలో చేరితే నిలువునా మునగడం ఖాయం.. కష్టపడకుండానే సులభంగా డబ్బు సంపాదించవచ్చనే మాయమాటలు నమ్మి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన పార్ట్‌టైమ్ జాబ్ ప్రకటన చూసి ఆకర్షితుడయ్యాడు. సదరు సంస్థ నిర్వహించిన ఓ సెమినార్‌కు హాజరయ్యాడు. అక్కడ సూట్లు వేసుకున్న కొందరు.. లగ్జరీ కార్లు, విదేశీ పర్యటనల పేరుతో ఆశపెట్టడంతో మాయమాటలు నమ్మి అప్పు చేసి మరీ లక్ష రూపాయల జాయినింగ్ ఫీజు చెల్లించి సభ్యుడిగా చేరాడు. ఆ తర్వాత కమీషన్‌కు తన బంధువులు, స్నేహితులను నమ్మించి వారితో కూడా లక్షల రూపాయలు కట్టించాడు. తీరా కొన్నాళ్లకు ఆ సంస్థ బోర్డు తిప్పేయడంతో డబ్బులు పోగొట్టుకున్న బంధువులు, స్నేహితులు అతడిపైనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ యువకుడు చివరకు కటకటాల పాలయ్యాడు.
వెంటనే తిరస్కరించండి..
- అరవింద్ బాబు, డీసీపీ, సైబర్ క్రైమ్, హైదరాబాద్
చైన్ మార్కెటింగ్ వలలో పడితే మీరు నష్టపోవడమే కాకుండా, మీ బంధువులు, దగ్గరివారిని కూడా ఇబ్బందుల పాలు చేసినవారవుతారు. మీకు మీరే బాస్.. అంటూ ఆకర్షించే ఫేక్ ప్రకటనలు, చైన్ సిస్టమ్ స్కీమ్‌ల గురించి ఎవరైనా చెబితే వెంటనే తిరస్కరించాలి. సంబంధాలు పాడుచేసుకుని జైలు పాలు కావొద్దు. ఎక్కడైనా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తిస్తే.. తక్షణమే డయల్ 112 లేదా సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి.






