భారీ బడ్జెట్ కేటాయింపులతో మెరుగైన వైద్యం : ఇఫ్కాయ్ చైర్మన్ డా.రంగారెడ్డి బుర్రి

by Naga Rani Yarlagadda |

కేంద్ర బడ్జెట్ 2026-27లో ఆరోగ్య రంగానికి రూ.1,05,530 కోట్లు కేటాయించడం వైద్య రంగాన్ని మరింత మెరుగుపర్చేందుకు కేంద్రం సిద్ధమైనట్లు అర్థమవుతుంది.

భారీ బడ్జెట్ కేటాయింపులతో మెరుగైన వైద్యం : ఇఫ్కాయ్ చైర్మన్ డా.రంగారెడ్డి బుర్రి
X

దిశ తెలంగాణ బ్యూరో: కేంద్ర బడ్జెట్ 2026-27లో ఆరోగ్య రంగానికి రూ.1,05,530 కోట్లు కేటాయించడం వైద్య రంగాన్ని మరింత మెరుగుపర్చేందుకు కేంద్రం సిద్ధమైనట్లు అర్థమవుతుంది. 'బయోఫార్మా శక్తి' పథకం ద్వారా రూ.10,000 కోట్లతో దేశీయంగా మందుల ఉత్పత్తిని ప్రోత్సహించడం , 17 రకాల క్యాన్సర్ మందులపై సుంకాలను రద్దు చేయడం సానుకూల పరిణామాలు. ఈ బడ్జెట్ ఎక్కువగా పరిశ్రమలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, మెడికల్ టూరిజంపైనే దృష్టి సారించింది. ప్రజారోగ్య వ్యయం ఇప్పటికీ జీడీపీలో కేవలం 1.8-2% మధ్యే ఉండటం ఆందోళనకరం. నివారణ వైద్యం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతం, ఆశా కార్యకర్తల సంక్షేమం వంటి అంశాలను బడ్జెట్ విస్మరించింది. సామాన్యుల వైద్య ఖర్చులు తగ్గించేలా బీమా పరిధిని పెంచాల్సిన అవసరం ఉంది. ఈ బడ్జెట్ వైద్య రంగాన్ని బలోపేతం చేసేలా ఉన్నా, సామాన్యులకు అందుబాటులో ఉండే సమతుల్య ప్రజారోగ్య వ్యవస్థ నిర్మాణంలో కొంత వెనుకబడింది.

Next Story