తెలంగాణ ఆర్‌అండ్‌బీకి జాతీయ స్థాయిలో గుర్తింపు

by Gantepaka Srikanth |

నిర్మాణాల్లో భద్రతా ప్రమాణాల అమలులో విశేష ప్రతిభ కనబరుస్తూ తెలంగాణ రోడ్లు భవనాల శాఖ (ఆర్అండ్ బీ) జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది.

తెలంగాణ ఆర్‌అండ్‌బీకి జాతీయ స్థాయిలో గుర్తింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిర్మాణాల్లో భద్రతా ప్రమాణాల అమలులో విశేష ప్రతిభ కనబరుస్తూ తెలంగాణ రోడ్లు భవనాల శాఖ (ఆర్అండ్ బీ) జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎన్.ఎస్.సీ.ఐ) ప్రకటించిన జాతీయ భద్రతా అవార్డును ఎంపికైన ఆర్అండ్‌బీ శాఖ గురువారం న్యూఢిల్లీలోని ద్వారకలోని యశోభూమిలో జరిగిన ఓ కార్యక్రమంలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి గాను ఆర్ అండ్ బికి సర్వశ్రేష్ఠ సురక్ష పురస్కార్ గోల్డెన్ ట్రోఫీ అవార్డు లభించింది. దేశవ్యాప్తంగా పాల్గొన్న 150 ప్రాజెక్టులలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో మొదటి ర్యాంక్‌ను సాధించి ట్రోఫీని తెలంగాణ గెలుచుకుంది.

అత్యంత నాణ్యమైన నిర్మాణంతో పాటు భద్రతలో అత్యుత్తమ పనితీరును గుర్తించి ఆసియా పసిఫిక్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ ఆర్గనైజేషన్(అపోషో) సెక్రటరీ జనరల్ బెర్నీ డోయల్ నుండి అవార్డును అందుకున్నారు. ఆర్ అండ్ బి బిల్డింగ్స్ విభాగం సీఈ రాజేశ్వర్ రెడ్డి, ఎల్ అండ్ టి చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ వి. రమేష్, ప్రాజెక్ట్ మేనేజర్ శరవణకుమార్, ఈహెచ్ఎస్ లీడ్ పి సత్యనారాయణ అవార్డును అందుకున్నారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల్లో భద్రతా ప్రమాణాలు, పర్యవేక్షణ, కార్మిక భద్రత చర్యలు సమర్థంగా చేపట్టినందుకు ఈ అవార్డు లభించింది. ప్రాజెక్టు అమలు విధానం, సేఫ్టీ ప్రోటోకాల్స్, మానిటరింగ్ సిస్టమ్, ప్రమాద నివారణ చర్యలు వంటి అంశాలలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. కాగా ఈ పనులను ఎల్ అండ్ టీ సంస్థ చేపట్టిన సంగతి తెలిసిందే.

Next Story